వేసవి సెలవుల్లో చిన్నారులకు విజ్ఞాన శిబిరాలు

ABN , First Publish Date - 2022-05-18T05:46:28+05:30 IST

వేసవి సెలవుల్లో చిన్నారులకు విజ్ఞాన శిబిరాలు ఏర్పాటుచేసి గ్రామీణ ఆటలు, పాటలు, నృత్యం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తామని శాఖాగ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ దాసరి సత్యనారాయణ అన్నారు.

వేసవి సెలవుల్లో చిన్నారులకు విజ్ఞాన శిబిరాలు
మార్టేరు శాఖా గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులు

ఆకివీడు, మే 17: వేసవి సెలవుల్లో చిన్నారులకు విజ్ఞాన శిబిరాలు ఏర్పాటుచేసి గ్రామీణ ఆటలు, పాటలు, నృత్యం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తామని శాఖాగ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ దాసరి సత్యనారాయణ అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం మంగళవారం ఆయన ప్రారంభించారు. లైబ్రరీ అధికారి పార్వతి, నెల్లి సతీష్‌, ఉపాధ్యాయడు కంభంపాటి నరశింహం, మహిళా పోలీస్‌ గౌసీబేగం పాల్గొన్నారు.


కాళ్ళ: కోపల్లె శాఖ గ్రంధాలయంలో పాఠశాల విద్యార్ధులకు వేసవి విజ్ఞాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రంధాలయాధికారి ఎస్‌ స్వరూపరాణి మంగళవారం తెలిపారు. కథలు, పుస్తక పఠనం, చిత్రలేఖనం, అల్లికలు, జనరల్‌ నాలెడ్జ్‌ వంటి ప్రత్యేక అంశాల్లో తర్ఫీదునిస్తామన్నారు.


ఉండి: యండగండిలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని వైస్‌ ఎంపీపీ దత్తాల సుజాతరాణి ప్రారంభించారు. ఉండి శాఖా గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని పశుసంవర్దకశాఖ ఏడీఏ మల్లేశ్వరరావు ప్రారంభించారు. గ్రంథా లయ పాలకుడు జేవీజీ.కృష్ణమూర్తి ఆద్వర్యంలో కార్యక్రమం జరిగింది. 


పెనుమంట్ర: మండలంలోని మార్టేరు శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని ప్రారంభించారు.

Updated Date - 2022-05-18T05:46:28+05:30 IST