గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం

ABN , First Publish Date - 2022-05-15T06:33:58+05:30 IST

పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 17 నుంచి జూన్‌ 30వ తేదీ వరకు గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహిస్తున్నట్లు గ్రంథపాలకుడు షరీఫ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం

కనిగిరి, మే 14: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 17 నుంచి జూన్‌ 30వ తేదీ వరకు గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహిస్తున్నట్లు గ్రంథపాలకుడు షరీఫ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 45 రోజుల పాటు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ శిక్షణ శిబిరంలో కథలు వినడం, కథలు చదవడం, పుస్తక సమీక్ష,  కథలు చెప్పడం, స్పోకెన్‌ఇంగ్లీష్‌, డ్రాయింగ్‌, పెయింటింగ్‌, సంగీతం, నాటకం, నృత్యం నేర్పించడంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని జ్ఞానాన్ని సమపార్జించుకోవాలన్నారు.

Updated Date - 2022-05-15T06:33:58+05:30 IST