ప్రచండ‘మే’!

ABN , First Publish Date - 2022-04-30T06:05:54+05:30 IST

ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు.

ప్రచండ‘మే’!

రెండు జిల్లాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు

నేడు, రేపు 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు

13 మండలాల్లో వడగాడ్పులు


ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. సాయంత్రం ఐదు దాటినా వేడి గాలి చల్లబడడం లేదు. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఇది. మే సమీపిస్తోంది. ఎండ తీవ్రత మరింత పెరగనుంది. భానుడు ప్రతాపం చూపనున్నాడు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో రెండు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతాయని, వడగాడ్పులు కూడా అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. శుక్రవారం విజయవాడలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.4 డిగ్రీలు నమోదైంది. మే నెల ప్రవేశిస్తున్న తరుణంలో ఉష్ణోగ్రతలు ఒక్కో డిగ్రీ పెరుగుతున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం 17 మండలాలు ఉన్నాయి. 13 మండలాల్లో శనివారం నుంచి రెండు రోజులపాటు 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాడ్పులు కూడా ఉంటాయని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 




Updated Date - 2022-04-30T06:05:54+05:30 IST