వేసవి ఫ్యాషన్‌!

ABN , First Publish Date - 2021-02-25T05:45:55+05:30 IST

వేసవి వచ్చేసింది. అందుకు తగ్గట్టుగా ఫ్యాషన్‌లో మార్పులు చేసుకుంటేనే, సీజనల్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌ను సృష్టించవచ్చు

వేసవి ఫ్యాషన్‌!

వేసవి వచ్చేసింది. అందుకు తగ్గట్టుగా ఫ్యాషన్‌లో మార్పులు చేసుకుంటేనే, సీజనల్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌ను సృష్టించవచ్చు. అలాంటి సమ్మర్‌ ఫ్యాషన్స్‌గా ఈ డ్రెస్సింగ్‌ స్టైల్స్‌ను ఫాలో అయిపోండి.


 ఫ్లేర్‌డ్‌ జీన్స్‌, స్లీవ్‌లెస్‌ టాప్స్‌: బిగుతైన జీన్స్‌ల స్థానాన్ని వదులుగా ఉండే ఫ్లేర్‌డ్‌ జీన్స్‌ ఆక్రమించేశాయి. ఇదే సరికొత్త సమ్మర్‌ ట్రెండ్‌. ఈ జీన్స్‌ను స్లీవ్‌లెస్‌ టాప్‌తో కలిపి ధరిస్తే చూడముచ్చటగా కనిపించడమే కాదు, వేసవి ఉక్కపోత నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఈ దుస్తులకు స్నీకర్స్‌ సరైన జోడీ!


 షార్ట్స్‌: వదులుగా ఉండే షార్ట్స్‌ వేసవి వాతావరణంలో సౌకర్యవంతంగా ఉంటాయి. కాటన్‌, లినెన్‌తో తయారైన లేత రంగుల షార్ట్స్‌ ఈ కాలంలో ఆకర్షణీయంగా ఉంటాయి.   


పూల డిజైన్లు 

వేడి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేవి తాజా పువ్వులే! కాబట్టే సమ్మర్‌లో పూల డిజైన్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. మోకాళ్ల వరకూ ఉండే షార్ట్‌ స్కర్ట్‌ మొదలు, నేల మీద జీరాడే లాంగ్‌ స్కర్ట్‌ వరకూ పూల డిజైన్‌ ఉన్నవి ఎంచుకోవాలి. పసుపుపచ్చ, నారింజ, ఎరుపు, గులాబీ రంగుల పూల డిజైన్లు ఈ కాలంలో ఆహ్లాదంగా కనిపిస్తాయి.


Updated Date - 2021-02-25T05:45:55+05:30 IST