సమ్మర్‌ ఫేస్‌ప్యాక్‌

ABN , First Publish Date - 2020-06-01T05:30:00+05:30 IST

ఎండలు మండుతున్న ఈ పరిస్థితుల్లో ఇంటివద్దనే ఫ్రూట్‌ప్యాక్‌తో ముఖాన్ని ప్రకాశమంతంగా మార్చుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే....

సమ్మర్‌ ఫేస్‌ప్యాక్‌

ఎండలు మండుతున్న ఈ పరిస్థితుల్లో ఇంటివద్దనే ఫ్రూట్‌ప్యాక్‌తో ముఖాన్ని ప్రకాశమంతంగా మార్చుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే....


  1. ముందుగా ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకొని పొడివస్త్రంతో తుడుచుకోవాలి. తర్వాత పాలతో కూడిన క్లీన్సర్‌ వాడాలి. చిన్నగిన్నెలో పాలు పోసి అందులో కాటన్‌ బాల్స్‌ను ముంచి వాటితో ముఖం, మెడ చుట్టూ రుద్దుకోవాలి. 10 నిమిషాలయ్యాక నిమ్మకాయ లేదా స్క్రబ్బర్‌తో రుద్దితో చర్మం మీది మృతకణాలు, మలినాలు వదలుతాయి. 
  2. చర్మం పొడిబారినట్టు అనిపిస్తే తేనె రుద్దుకోవాలి. 10 నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. 
  3. వేడినీళ్లను గిన్నెలో పోసి టేబుల్‌ మీద పెట్టాలి. ఇప్పుడు ముఖాన్ని గిన్నెకు దగ్గరగా తీసుకురావాలి. టవల్‌ను ముఖానికి అడ్డుగా పెట్టుకుంటే వేడినీటి ఆవిర్లు ముఖానికి తగిలి చర్మరంధ్రాలు తెరచుకుంటాయి.
  4. అరటిపండు, కీరదోస, కొన్ని వేపాకులు, తేనె, పెరుగు తీసుకొని మిక్సీలో మెత్తని పేస్ట్‌ తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ఫ్రిజ్‌లో 15 నిమిషాలు పెట్టి, ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతిమంతంగా మారుతుంది.

Updated Date - 2020-06-01T05:30:00+05:30 IST