సుమిత్‌, యోగేశ్‌ ప్రపంచ రికార్డులు

ABN , First Publish Date - 2022-08-20T10:57:08+05:30 IST

టోక్యో పారాలింపిక్స్‌ జావెలిన్‌ త్రో చాంపియన్‌ సుమిత్‌ అంటిల్‌, డిస్కస్‌ త్రో రజత పతక విజేత యోగేశ్‌ కుతునియా ఇండియా ఓపెన్‌ జాతీయ పారా అథ్లెటిక్స్‌..

సుమిత్‌, యోగేశ్‌ ప్రపంచ రికార్డులు

బెంగళూరు: టోక్యో పారాలింపిక్స్‌ జావెలిన్‌ త్రో చాంపియన్‌ సుమిత్‌ అంటిల్‌, డిస్కస్‌ త్రో రజత పతక విజేత యోగేశ్‌ కుతునియా ఇండియా ఓపెన్‌ జాతీయ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో రికార్డు ప్రదర్శనతో అదరగొట్టారు. శుక్రవారం జరిగిన పోటీల్లో సుమిత్‌ ఎఫ్‌64 ఈవెంట్‌లో జావెలిన్‌ను ఏకంగా 68.62 మీటర్లు త్రో చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో గతంలో తన పేరిటేనున్న 68.55 మీటర్ల రికార్డును అధిగమించాడు. యోగేశ్‌ డిస్క్‌ను 48.34 మీటర్లు విసిరి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు.   

Updated Date - 2022-08-20T10:57:08+05:30 IST