Oct 28 2021 @ 16:19PM

వర్మ హీరోయిన్ తో సుమంత్ రొమాన్స్ ‘మళ్ళీ మొదలైంది’

బిఫోర్ లాస్టియర్ ‘కపటధారి’ చిత్రంతో సుమంత్ ప్రేక్షకుల్ని పలకరించారు. కన్నడ రీమేక్ అయిన ఈ సినిమా ఆశించిన రీతిలో అలరించలేకపోయింది. ప్రస్తుతం సుమంత్ నటించిన రెండు సినిమాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అందులో అనగనగా ఒక రౌడీ  యాక్షన్ ఎంటర్ టైనర్ అయితే .. మరో సినిమా ‘మళ్ళీ మొదలైంది’ రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఈ మూవీలో సుమంత్ సరసన వర్మ హీరోయిన్ నైనా గంగూలి నటిస్తోంది. రెడ్ సినిమాస్ బ్యానర్ పై కె.రాజశేఖర రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. టీజీ కీర్తి కుమార్ దర్శకుడు. విడాకుల తర్వాత ప్రేమలో పడే ఒక యువకుడి కథ గా ఈ మూవీ రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ‘మళ్ళీ మొదలైంది’ ట్రైలర్ ను లాంఛ్ చేశారు మేకర్స్. 



ఒక యువతిని పెళ్ళిచేసుకొని ఆమెకి విడాకులిచ్చిన హీరో.. ఆమె అడ్వకేట్ తోనే ప్రేమలో పడతాడు. ఆమె పేరు పవి. విడాకులిచ్చిన వారి కోసం ఓ క్లబ్ ను ప్రారంభించి వారికి కొత్త జీవితాన్నివ్వాలనుకుంటుంది. అప్పుడు జరిగే అనూహ్య సంఘటనలు కథను మలుపు తిప్పుతాయి. ఫన్ అండ్ రొమాన్స్ ప్రధానంగా ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్దమవుతుంది. వర్షిణి, పోసాని కృష్ణమురళి, పృధ్వి, అన్నపూర్ణ, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమాతో సుమంత్ సక్సెస్ జెర్నీ కొత్తగా మళ్ళీ మొదలవుతుందేమో చూడాలి.