గొర్రిపూడిలో ఘనంగా శూలాల సంబరం

ABN , First Publish Date - 2021-02-26T05:37:48+05:30 IST

కరప, ఫిబ్రవరి 25: పురాణ ప్రాశస్త్యం కలిగిన గొర్రిపూడి బసవేశ్వరస్వామి ఆలయంలో పార్వతి పరమేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని పురష్కరించుకుని గు

గొర్రిపూడిలో ఘనంగా శూలాల సంబరం
బుగ్గలకు శూలాలు గుచ్చుకున్న కరికాల భక్తులు

కరప, ఫిబ్రవరి 25: పురాణ ప్రాశస్త్యం కలిగిన గొర్రిపూడి బసవేశ్వరస్వామి ఆలయంలో పార్వతి పరమేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం శూలాల (అలుగుల) సంబరాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిర కరికాల భక్తులు తమ బుగ్గలకు శూలాలను గుచ్చుకుని స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ట్రాక్టర్లపై గ్రామ వీధుల్లో తిరుగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా కరికాల భక్తులు మాట్లాడుతూ ఐదు దశాబ్దాలుగా ఈ సంబరాన్ని వేడుకగా నిర్వహిస్తున్నామన్నారు. రెండురోజుల కిందట స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించామన్నారు. సంతానంలేనివారు ఆలయంలోని నంది ప్రతిమను ఎత్తుకుని నిప్పులగుండం తొక్కితే సంతానం కలుగుతుందని, శనివారం రాత్రి ఈ నిప్పులగుండం తొక్కి మొక్కులు తీర్చుకునేలా ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాదిమంది గొర్రిపూడి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.

Updated Date - 2021-02-26T05:37:48+05:30 IST