సుకన్య సమృద్ధి యోజనపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2020-11-29T05:50:03+05:30 IST

సుకన్య సమృద్ధి యోజన పథకంపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ అన్నారు. శనివారం స్త్రీ శిశు సంక్షేమ శాఖ, డీఆర్‌డీవో, ఏపీఎం, పోస్టల్‌ అధికారులతో ఆన్‌లైన్‌ గూగుల్‌ మీట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి జిల్లాలో పథకం అమలు తీరును సమీక్షించారు.

సుకన్య సమృద్ధి యోజనపై అవగాహన కల్పించాలి
ఆన్‌లైన్‌ గూగుల్‌ మీట్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

ఆన్‌లైన్‌ గూగుల్‌ మీట్‌ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ 

భువనగిరి రూరల్‌, నవంబరు 28: సుకన్య సమృద్ధి యోజన పథకంపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ అన్నారు. శనివారం స్త్రీ శిశు సంక్షేమ శాఖ, డీఆర్‌డీవో, ఏపీఎం, పోస్టల్‌ అధికారులతో ఆన్‌లైన్‌ గూగుల్‌ మీట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి జిల్లాలో పథకం అమలు తీరును సమీక్షించారు. బేటీ బచావో.. బేటీ పడావో నినాదంతో కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని 2015 నుంచి అమలు చేస్తోందని, అమ్మాయి పుట్టిన తేదీ నుంచి 10 సంవత్సరాలలోపు సహజ సంరక్షకులు, తల్లిదండ్రులు పోస్ట్‌ ఆఫీ్‌సలో ఖాతా తెరిచి నెలకు కనీసం రూ.250 చొప్పున ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1లక్షా 50వేలకు తక్కువ కాకుండా చెల్లించినచో బాలిక వివాహ సమయంలో వడ్డీతో ఎక్కువ లబ్ధి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రెడ్డి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, పోస్టల్‌ సూపర్‌వైజర్‌ సంపత్‌రెడ్డి పాల్గొన్నారు. 

ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు వెంటనే తరలించాలి

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొనుగోలుకేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే రైస్‌ మిల్లులకు తరలించాలని కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ సూచించారు. శనివారం సాయంత్రం పౌరసరఫరాలు, వ్యవసాయ, సహకార, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో గూగుల్‌ మీట్‌ ఆన్‌లైన్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. గత రెండు రోజులుగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ధాన్యం కొనుగోలు నిలిచిపోయినందున పరిస్థితులను బట్టి ఆదివారం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్‌డీవో ఎం.ఉపేందర్‌రెడ్డి, పౌరసరఫరాల జీఎం గోపికృష్ణ, డీసీవో డి వెంకట్‌రెడ్డి, డీఏవో కె అనురాధ తదితరులు ఉన్నారు.


Updated Date - 2020-11-29T05:50:03+05:30 IST