Abn logo
Apr 10 2020 @ 11:26AM

‘లూసిఫ‌ర్’ రీమేక్ ద‌ర్శ‌కుడు అత‌నేనా?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఆచార్య‌’ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత చిరంజీవి త‌న 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్‌’ను రీమేక్ చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు టాక్‌. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ న‌టించిన ఈ చిత్రాన్ని తెలుగు నెటివిటీకి అనుగుణంగా మారుస్తున్నారట‌. మ‌రి ఈ సినిమాను ఎవ‌రు డైరెక్ట్ చేస్తారు? అనే దానిపై ర‌క‌ర‌కాల వార్త‌లు సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్నాయి. లేటెస్ట్ సమాచారం మేరకు సుజిత్ ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడ‌ట‌. ప్ర‌భాస్‌తో ‘సాహో’ని డైరెక్ట్ చేసిన సుజిత్ ఫైన‌ల్‌గా చిరుని మెప్పిస్తాడా?  లేదా? అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement
Advertisement
Advertisement