రవిశంకర్‌ మృతికి కారకులను అరెస్టు చేయాలి

ABN , First Publish Date - 2021-02-26T06:02:28+05:30 IST

నడిపూడి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన బలపరిచిన అభ్యర్థికి బూత్‌ ఏజెంటుగా వెళ్లిన యాళ్ల రవిశంకర్‌(25) ఆత్మహత్యకు కారకు లైన వారిని అరెస్టు చేసి మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈదరపల్లి ఆర్‌ఆర్‌నగర్‌లోని ఏజీ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.

రవిశంకర్‌ మృతికి కారకులను అరెస్టు చేయాలి
ఆర్‌ఆర్‌నగర్‌ ఏజీరోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు

  • మృతుని కుటుంబానికి రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
  • మృతదేహంతో ఏజీరోడ్డుపై టీడీపీ, జనసేన రాస్తారోకో
  • వైసీపీ అరాచకాలకు రవిశంకర్‌ బలైపోయాడు: చినరాజప్ప, రెడ్డి సుబ్రహ్మణ్యం

అమలాపురం రూరల్‌, ఫిబ్రవరి 25: నడిపూడి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన బలపరిచిన అభ్యర్థికి బూత్‌ ఏజెంటుగా వెళ్లిన యాళ్ల రవిశంకర్‌(25) ఆత్మహత్యకు కారకు లైన వారిని అరెస్టు చేసి మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈదరపల్లి ఆర్‌ఆర్‌నగర్‌లోని ఏజీ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. మృత దేహంతో రాస్తారోకోకు దిగడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ స్తంభింది. తాలూకా సీఐ జి.సురేష్‌బాబు, ఎస్‌ఐలు సీహెచ్‌ రాజేష్‌, జి.వెంకటేశ్వరరావు సిబ్బందితో అక్కడికి చేరుకు ని ఆందోళనకారులను పక్కకు తప్పించి మృతదేహం ఉన్న అంబులెన్సును బండారులంక శ్మశానవాటికకు తరలించారు. రవిశంకర్‌ ఆత్మహత్యకు కారణమైన ఘటనపై సూసైడ్‌ నోట్‌ ఆలస్యంగా బయటపడడంతో అప్పటికే మృతదేహాన్ని బండారులంక శ్మశానవాటికలో ఖన నం చేశారు. తమ కుమారుడిని వైసీపీ నాయకులు చంపుతామని బెదిరించడంతోపాటు సూసైడ్‌ నోట్‌ లభించడంతో మృతుని తల్లిదండ్రులు యాళ్ల సత్యనారాయణ, శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం అర్ధరాత్రి తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. తహ శీల్దార్‌ జి.రవీంద్రనాథ్‌ఠాగూర్‌, ఎస్‌ఐ సీహెచ్‌ రాజేష్‌ ఆధ్వర్యంలో గురువారం మృతదేహా న్ని వెలికితీసి శవపంచనామా పూర్తిచేశారు. రాస్తారోకోలో టీడీపీ పార్లమెంటు జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి అధికారి జయవెంకటలక్ష్మి, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి శెట్టిబత్తుల రాజబాబు, ఆయా పార్టీల నాయకులు లింగోలు పండు, పిచ్చిక శ్యామ్‌, కొప్పుల నాగమానస, సూదా చిన్నా, బట్టు పండు పాల్గొన్నారు. 

వైసీపీ అరాచకాలకు రవిశంకర్‌ బలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు అంతూపొంతూ లేకుండా పోయిందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. పంచాయతీ వార్డు మెంబర్లను గెలిపించుకునేందుకు రిగ్గింగ్‌కు పాల్పడే దు స్థితికి అధికార వైసీపీ దిగజారిపోయిందన్నారు. రవిశంకర్‌ మృతదేహానికి బండారులంక శ్మశానవాటికలో పొస్టుమార్టం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మాజీఎమ్మెల్యే అయి తాబత్తుల ఆనందరావుతో కలసి వారు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నడిపూడి మెట్ల రాంజీకాలనీలో ఎన్నికల సమయంలో జరిగిన పలు ఘటనలను మహిళలు వారికి వివరించారు. రవిశంకర్‌ కుటుంబానికి రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండు చేశారు. వారివెంట నాయకులు పెచ్చెట్టి చంద్రమౌళి, బొర్రా ఈశ్వరరావు, పరమట శ్యామ్‌ కుమార్‌, మంద గెద్దయ్య, పిచ్చిక శ్యామ్‌ తదితరులున్నారు. రవిశంకర్‌ కుటుంబాన్ని ఆదుకునే అంశంపై స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ శ్మశానవాటికలో పట్టుబట్టారు. దీంతో తహశీల్దార్‌ ఠాగూర్‌ ఈ విషయాన్ని సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఫోన్‌లో మాట్లాడి ఆందోళనకారుల డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మృతుడి కుటుంబానికి సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - 2021-02-26T06:02:28+05:30 IST