ఆకలి బాధతో మహారాష్ట్రకు చెందిన వృద్ధ దంపతుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-04-09T05:42:38+05:30 IST

చేద్దామంటే పని లేదు.. చేసే సత్తువా లేదు.. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ వృద్ధ దంపతులకు ముదిమి వయసులో ముద్ద పెట్టేవారు కరువయ్యారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై.. ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారకర ఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలంలో గురువారం చోటు చేసుకుంది.

ఆకలి బాధతో మహారాష్ట్రకు చెందిన వృద్ధ దంపతుల ఆత్మహత్య

నస్రుల్లాబాద్‌, ఏప్రిల్‌ 8 : చేద్దామంటే పని లేదు.. చేసే సత్తువా లేదు.. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ వృద్ధ దంపతులకు ముదిమి వయసులో ముద్ద పెట్టేవారు కరువయ్యారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై.. ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారకర ఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ తాలూకాలోని బిలోలి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు గంగాధర్‌(70), భార్య మహానంద(65)లు. వీరికి సంతానం లేదు. దీంతో మూడు నెలల క్రితం బిలోలి గ్రామంలో ఉన్న ఖాళీ స్థలాన్ని అమ్మి.. వచ్చిన డబ్బులతో తీర్థ యాత్రలకు బయలుదేరారు. ఇటీవలే ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. దీంతో ఓవైపు చేతిలో డబ్బులు లేకపోవడం.. మరోవైపు ఆలనా పాలనా చూసే వారు లేకపోవడంతో ఆకలి బాధకు తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది గురువారం నస్రుల్లాబాద్‌ మండలం మైలారం గ్రామ శివారులో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బీర్కూర్‌ మండలంలోని వీరాపూర్‌ గ్రామానికి చెందిన వృద్ధుల బంధువు కత్రి భగవాన్‌ సింగ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-04-09T05:42:38+05:30 IST