Abn logo
Mar 2 2021 @ 23:35PM

ఏర్గట్లలో అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

ఏర్గట్ల, మార్చి 2: మండల కేంద్రంలో మంగళవారం అప్పుల బాధతో గ్రామానికి చెందిన సనుగుల ప్రశాంత్‌(24) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఎండీ ఆసీఫ్‌ తెలిపిన వివరాల ప్రకారం... ప్రశాంత్‌ 15 రోజుల నుంచి అప్పుల గురించి ఆలోచిస్తున్నాడు. ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో మంగళవారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా తన భర్త మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ప్రశాంత్‌ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.   

Advertisement
Advertisement