యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-24T06:22:29+05:30 IST

మండలంలోని కొడిగెనహళ్లిలో నివాసముంటున్న నజీర్‌ (32) సోమవారం ఇంట్లో ఉరేసుకు న్నాడు. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలివి. నజీర్‌ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు.

యువకుడి ఆత్మహత్య
మృతుడు నజీర్‌

పరిగి, మే 23: మండలంలోని కొడిగెనహళ్లిలో నివాసముంటున్న నజీర్‌ (32) సోమవారం ఇంట్లో ఉరేసుకు న్నాడు. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలివి. నజీర్‌ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఏడా ది క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. భార్య కాపురానికి రాకపోవడం తో మనస్తాపం చెంది, ఇంటి పైకప్పునకు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హిం దూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-05-24T06:22:29+05:30 IST