దంపతుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-27T05:02:58+05:30 IST

ఆయన చార్టెడ్‌ అకౌంటెంట్‌.. పాలమూరులో సుధీర్ఘకాలంగా ప లువురికి చార్టెడ్‌ అకౌంటెంట్‌గా వ్యవహరిస్తున్నారు..

దంపతుల ఆత్మహత్య
లత, నర్సింహారెడి (ఫైల్‌)

- పట్టణంలో చార్టెడ్‌ అకౌంటెంట్‌గా నర్సింహారెడ్డి సుపరిచితుడు

- ఆత్మహత్యకు అనారోగ్యం, ఇతర కారణాలపై పోలీసు విచారణ

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 26 : ఆయన చార్టెడ్‌ అకౌంటెంట్‌.. పాలమూరులో సుధీర్ఘకాలంగా ప లువురికి చార్టెడ్‌ అకౌంటెంట్‌గా వ్యవహరిస్తున్నారు.. ఆర్థికంగా ఉ న్నతంగా ఉన్నారు.. ఐదుపదుల వయసులో భార్యతో కలిసి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవ డం పాలమూరు పట్టణంలో కలక లం రేపుతోంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివ రాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ మండలం ధర్మాపూర్‌ గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి(54), లత(48) దంపతులు పాలమూరు పట్టణంలో స్థిరపడ్డారు. మధురానగర్‌ కాలనీలో ఉంటున్న నర్సింహారెడ్డి పట్టణంలోని వైడీ గుప్త ట్రేడర్స్‌ తో పాటు పలువురికి చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. భార్య గృహిణి. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు మూడు నెలల క్రితమే కెనడాకు వెళ్ళాడు. కూతురు సుష్మ సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తుంది. మంగళవారం ఉద యం 7:40 గంటలకు కూతురు జిమ్‌కోసం బయటకు వెళ్లి తిరిగి 8:30 గంటలకు ఇంటికి వచ్చింది. అప్పటికే తల్లిదండ్రులు ఇద్దరూ హాల్‌లోని కిటికీకి బట్టలతీగతో ఉరేసుకొని ఉండటం గమనించి దిగ్ర్భాంతికి గురైంది. రోదిస్తూ చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు వచ్చి కిందకు దించేలోపు చనిపోయి ఉన్నారు. విషయం పోలీ సులకు చేరవేయడంతో రూరల్‌ ఎస్సై రమేశ్‌, ఏఎస్సై సుజాత ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలను కుటుం బ స భ్యులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కుమారుడు కెనడా నుంచి బుధ వారం రానుండటంతో మృతదే హాలను జనరల్‌ ఆసుపత్రిలోని మార్చూరీకి తర లించారు. 

 ఆత్మహత్యకు అసలు కారణం ఏంటి?

దంపతుల అనారోగ్యం కారణం వల్లేవారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కుటుం బసభ్యులు, ఇరుగుపొరుగు వారు భావిస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నారని, ఆర్థిక ఇబ్బందులు ఆత్మహత్యకు కారణం కాదని చెబుతున్నారు. పాల మూరులో మూడంతస్తుల ఇంటితో పాటు ధర్మాపూర్‌లో పొలాలు ఉన్నాయి. కొన్నాళ్లుగా దంపతులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెబుతున్నా రు. పెళ్ళికి వచ్చిన కొడుకు, కూతురుకు పెళ్ళి చేయాల్సిన సమయంలో దంపతు లు అనారోగ్య కారణంతో ఆత్మహత్య చేసుకోవడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. ఎలాంటి అనారోగ్యం ఉన్నా వారికి మంచి జీవితాలను ఇచ్చి తమ బాధ్య తలను తీర్చుకో వాలని అనుకుంటారు. దంపతులిద్దరూ ఆత్మహత్యకు ఇతర కు టుంబ కారణాలు ఏవైనా ఉంటాయా అన్న కోణంలోనూ విచారణ జరుగుతోంది. కొడుకు వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయని తెలుస్తోంది.  దం పతుల ఆత్మ హత్య విషయం తెలిసి బందువులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకొని విలపించారు.


Updated Date - 2021-10-27T05:02:58+05:30 IST