Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 23 Sep 2022 00:25:31 IST

ఆత్మహత్య.. సమస్యకు పరిష్కారం కాదు

twitter-iconwatsapp-iconfb-icon
ఆత్మహత్య.. సమస్యకు పరిష్కారం కాదువాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తున్న న్యాయమూర్తి, కలెక్టర్‌

ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ శ్రీనివాసరావు 

ఖమ్మంలీగల్‌, సెప్టెంబరు 22: సమస్యలు లేని మనిషి లేడని, సమస్యకు పరిష్కారం మాత్రం ఆత్మహత్య కాదని, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ టి.శ్రీనివాసరావు అన్నారు. గురువారం న్యాయమూర్తి న్యాయసేవాసదనలో ఆత్మహత్యల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సమస్యలకు పరిష్కారం తప్పకుండా ఉంటుందని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని పరిష్కారం కనుగొనాలన్నారు. ఏ పనిచేసినా సంతోషంగా చేయాలని, ఒత్తిడికి గురి కావొద్దన్నారు. ఒత్తిడికి గురైనప్పుడు చిన్న విరామం తీసుకుని నూతనోత్సాహంతో తిరిగి పనిచేయాలన్నారు. దగ్గరి వాళ్ల మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొనేవారు, తమ కుటుంబం గురించి ఆలోచించాలన్నారు. ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ మాట్లాడుతూ పనిని భారంగా కాకుండా, త్రికరణశుద్ధితో చేయాలని తెలిపారు. మనకోసం చేసిన పని మనని కొంతమేరకే సంతోష పెడుతుందని, ఇతరుల కోసం పని చేసినప్పుడే పూర్తి సంతోషం  వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మహత్యల నివారణ కోసం రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. న్యాయమూర్తులు ఎన.సంతో్‌షకుమార్‌, ఎంఏ జావీద్‌పాషా, ఎన.అమరావతి, ఆషారాణి, శాంతిసోని, మౌనిక, పూజిత, అదనపు కలెక్టర్లు మధుసూదన, రాధికాగుప్తా, డీఈవో యాదయ్య, డీసీపీ ప్రసన్నకుమార్‌, జిల్లా కోర్టు ముఖ్య పరిపాలనాధికారి సూర్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ఖమ్మం Latest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.