ఆత్మహత్యలే శరణ్యం

ABN , First Publish Date - 2020-05-21T09:30:46+05:30 IST

అమరావతి నిర్మాణాలు ఆపేస్తే మూకుమ్మడి ఆత్మహత్యలే శరణ్యం అంటూ రాజధానికి

ఆత్మహత్యలే శరణ్యం

గుంటూరు,ఆంధ్రజ్యోతి/తాడికొండ, మే 20 : అమరావతి నిర్మాణాలు ఆపేస్తే మూకుమ్మడి ఆత్మహత్యలే శరణ్యం అంటూ రాజధానికి భూములిచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు బుధవారం 155వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి భావితరాల భవిష్యత్తును నాశనం చేయవద్దని కోరారు. 29 గ్రామాల రైతులు వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అమరావతి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించారు. తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు 32వ రోజుకు చేరుకున్నాయి.  

Updated Date - 2020-05-21T09:30:46+05:30 IST