Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియక పోలీసులు అయోమయం.. తల్లిదండ్రులూ తెలియదన్నారు.. ఆ చిన్న ఆధారం నిందితుడిని క్షణాల్లో పట్టించింది..

ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెలా- పెండ్రా- మర్వాహీ జిల్లాలో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసును ఛేదించిన పోలీసులు ఆమె ప్రేమికుడిని అరెస్టు చేశారు. ఆ యువతి ఆత్మహత్యకు ఆ యువకుడే కారణమనే ఆరోపణలున్నాయి. ఆ యువతి మొబైల్ ఫోనులో లభ్యమైన ఆడియో క్లిప్ ఆధారంగా అసలు విషయం వెల్లడయ్యింది. ఆ యువకుడు పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, తనపై అత్యాచారం జరిపాడని, తాను తిరిగి ప్రశ్నించగా, చచ్చిపోమంటూ నిందించాడని ఆ యువతి ఆడియోలో పేర్కొంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గౌరెలా పోలీస్ స్టేషన్ పరిధిలో కుసుమ ఉరఫ్ రాణీ భాను(25) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను విచారించినప్పటికీ ఆమె మృతికి కారణాలు తెలియరాలేదు. అయితే ఆ యువతి మొబైల్ ఫోనును స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పరిశీలిస్తున్న నేపధ్యంలో మృుతురాలి ఆడియో క్లిప్ బయటపడింది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ యువతి తన మాటలను రికార్డు చేసింది. దానిలో గిర్వర్‌కు చందిన మహేంద్ర యాదవ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడని పేర్కొంది. ఆ తరువాత తాను ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా కొట్టేవాడని, చచ్చిపో అంటూ నిందించేవాడని, ఈ వేధిపులకు కలత చెంది తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు మహేంద్రనే కారణమని ఆమె ఆ ఆడియోలో ఆరోపించింది. విచారణలో భాగంగా పోలీసులు మృతురాలి ఇంటి చుట్టుపక్కలవారిని ప్రశించగా వారు మహేంద్రతో ఆ యువతికి సంబంధం ఉన్నదని తెలిపారు. ఈ నేపధ్యంలోనే పోలీసులు మహేంద్రను అరెస్టు చేశారు. తరువాత కోర్టులో ప్రవేశపెట్టి అక్కడి నుంచి జైలుకు తరలించారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement