కారులో లాక్ చేసుకొని ఆత్మహత్యాయత్నం...

ABN , First Publish Date - 2021-04-11T13:35:00+05:30 IST

కారులో లాక్‌ చేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన

కారులో లాక్ చేసుకొని ఆత్మహత్యాయత్నం...

హైదరాబాద్‌ : అప్పుల బాధతో ఓ వ్యక్తి విషం తీసుకొని.. కారులో లాక్‌ చేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సకాలంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ స్పందించి బాధితుడ్ని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. బాలాజీనగర్‌కు చెందిన డ్రైవర్‌ సాయిబాబా అప్పులు చేసి తీర్చకపోవడంతో అప్పు ఇచ్చినవారి వేధింపు ఎక్కువైంది. దీంతో విషం తీసుకుని కారులోకి వెళ్లి లాక్‌ చేసుకుని భార్యకు ఫోన్‌ చేసి చెప్పాడు. ఆమె హుటాహుటిన జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కానిస్టేబుల్‌ వచ్చి బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. 

Updated Date - 2021-04-11T13:35:00+05:30 IST