Abn logo
Apr 16 2021 @ 04:33AM

స్పీకర్‌ ముందు పారిశుధ్య కార్మికుడి ఆత్మహత్యాయత్నం

ఆమదాలవలస, ఏప్రిల్‌ 15 : శ్రీకాకుళం జిల్లాలో ఓ పారిశుధ్య కార్మికుడు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. గురువారం ఆమదాలవలసలో వలంటీర్ల సన్మాన సభకు స్పీకర్‌తో మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మునిసిపాలిటీల్లో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన లొట్ల అనిల్‌కుమార్‌ను 2019 ఆగస్టులో విధుల నుంచి తొలగించారు. ఉపాధి కోల్పోయిన ఆవేదనతో అనిల్‌ గురువారం సభ ప్రాంగణంలో బ్లేడ్‌తో కంఠం కోసుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
Advertisement