Abn logo
Jul 31 2021 @ 00:02AM

యువకుడి ఆత్మహత్యాయత్నం

యువకుడిని రైల్వేట్రాక్‌ నుంచి తీసుకొస్తున్న సర్పంచ్‌ మదన్‌

  ప్రాణాలు కాపాడిన బొడ్డపాడు సర్పంచ్‌ 

పలాస రూరల్‌: మం దస   గౌడవీధికి చెందిన ఓ యువకుడు  కుటుంబ కల హాలతో విరక్తి చెంది బొడ్డపాడు   సమీపంలోని యాపోడు చెరువు జంక్షన్‌ వద్ద రైల్వేట్రాక్‌పై ఆత్మ హత్యాయత్నానికి శుక్రవా రం సిద్ధమయ్యాడు. దూరం నుంచి గమనించిన బొడ్డపా డు సర్పంచ్‌ తామాడ మదన్‌ అప్రమత్తమై ఆ యువకుడ్ని ట్రాక్‌పై నుంచి పక్కకు తీసుకు వచ్చి జీవి తంపై అవగాహన కల్పించా డు. కష్టసుఖాలు తెలుసుకొని ముందుకుసాగాలని, కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవడం సమంజసంకాదని అవగాహన కల్పించి ఆయన  ప్రాణాలను కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబసభ్యులతో పాటు మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు సర్పంచ్‌ మదన్‌ను అభినందించారు.