Suicide Attempt.. నెల్లూరు: మరో దళితుడు ఆత్మహత్య యత్నం

ABN , First Publish Date - 2022-08-24T20:53:15+05:30 IST

నెల్లూరు (Nellore): నగరంలో పోలీసుల వేధింపులు తాళలేక మరో దళితుడు ఆత్మహత్యయత్నం చేశాడు.

Suicide Attempt.. నెల్లూరు: మరో దళితుడు ఆత్మహత్య యత్నం

నెల్లూరు (Nellore): నగరంలో పోలీసుల వేధింపులు తాళలేక మరో దళితుడు ఆత్మహత్యయత్నం (Suicide Attempt) చేశాడు. 4వ పట్టణ ఎస్ఐ బాచిబాబు ఓ కేసు విషయంలో వేధిస్తున్నాడని సాయిచంద్ అనే దళిత యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. టీడీపీ (TDP) కార్యకర్త కావడంతోనే కేసు విషయంలో వేధిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రస్తుతం సాయిచంద్ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ (Abdul Aziz) బాధితుడిని ఆస్పత్రిలో పరామర్శించారు. జిల్లాలో దళితులపై అధికార పార్టీ, పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని అబ్దుల్ అజీజ్ అన్నారు.

Updated Date - 2022-08-24T20:53:15+05:30 IST