మార్కాపురం, మార్చి 4: వైసీపీ తరఫున పోటీచేసేందుకు పార్టీ అధిష్ఠానం బీఫాం ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది ఒక నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన పాపిరెడ్డి సుబ్బారెడ్డి 2వ వార్డులో వైసీపీ తరఫున నామినేషన్ వేశారు. అయితే పార్టీ బీఫాం మరో వ్యక్తికి ఇచ్చారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుబ్బారెడ్డి గురువారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. స్థానికులు అతడిని జిల్లా వైద్యశాలకు తరలించారు. ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి ఆయనను పరామర్శించి, భవిష్యత్‌లో అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.