కరాచీ వర్సిటీలో ఆత్మాహుతి దాడి

ABN , First Publish Date - 2022-04-27T07:38:36+05:30 IST

పాకిస్థాన్‌లోని కరాచీలో మంగళవారం చోటుచేసుకున్న బాంబు పేలుడులో నలుగురు మృతిచెందారు.

కరాచీ వర్సిటీలో ఆత్మాహుతి దాడి

ముగ్గురు చైనీయులు  సహా నలుగురి మృతి

కరాచీ, ఏప్రిల్‌ 26: పాకిస్థాన్‌లోని కరాచీలో మంగళవారం చోటుచేసుకున్న బాంబు పేలుడులో నలుగురు మృతిచెందారు. కరాచీ వర్సిటీలో కన్ఫూషియస్‌ అనే సంస్థలో పనిచేస్తున్న నలుగురు చైనీయులు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. వారు ప్రయాణిస్తున్న వ్యాన్‌ వద్దకు మంగళవారం బుర్ఖాలో బాంబుతో వచ్చిన ఒక మహిళ తనను తాను పేల్చేసుకున్నట్లు అధికారులు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. మరో చైనీయుడితో పాటు వ్యాన్‌కు సమీపంలో ఉన్న పలువురు తీవ్రంగా గాయపడ్డారని వారు వివరించారు. ఈ దాడి తమ పనేనని బలోచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ(బీఎల్‌ఏ) ప్రకటించుకుంది. షరీ బలూచ్‌ అనే తొలి మహిళా ఆత్మాహుతి బాంబర్‌ను ఇందుకోసం వినియోగించామని తెలిపింది. ఘటనపై ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-04-27T07:38:36+05:30 IST