నాతవరం అక్టోబరు 29 : ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో ఓ యువకుడు పురుగుల మందు త్రాగి మృతి చెందిన విషాదకరమైన ఉదంతమిది. పోలీసుల కధనం ప్రకారం నాతవరం మండలం ఎంబీపట్నం గ్రామానికి చెందిన శెట్టి సూర్యనారాయణమూర్తి (35) ఎంఎస్‌ఇ, ఎంఇడి చదువుకున్నాడు. కొంతకాలం నుంచి ఉద్యోగం రాలేదని మనస్థాపం చెందేవాడు. ఈ నెల 27వ తేది రాత్రి సూర్య నారాయణమూర్తి పురుగుల మందు త్రాగి మేడపై పడి ఉండటం చూసి సూర్యనాయణమూర్తి తల్లి సింహచలం ఇంటి దగ్గర వారికి చెప్పడంతో నర్సీపట్నం ఆసుపత్రికి తీసుకెళ్ళారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నం కెజిహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 29వ తేది ఉదయం సూర్యనారాయణమూర్తి మృతి చెందాడు. మృతుడు సోదరుడు శెట్టి రామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.