Abn logo
Apr 20 2021 @ 22:57PM

వివాహిత ఆత్మహత్యభర్త వేధింపులే కారణం

పాచిపెంట, ఏప్రిల్‌ 20 : భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నార్లవలసలో సోమవారం రాత్రి జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నార్లవలసకు చెందిన జన్ని బుజ్జి (21) అనే వివాహిత సోమవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఒడిశాలోని సుంకి పంచాయతీ ఇప్పలవలసకు చెందిన బుజ్జికి నార్లవలసకు చెందిన జన్ని అప్పన్నతో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. గత ఏడాదిగా దంపతులిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో సోమవారం రాత్రి పురుగు మందు తాగి అపస్మారకస్థితికి చేరుకుంది. ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెందింది. భర్త వేధింపులతోనే కుమార్తె బుజ్జి మృతి చెందినట్టు తండ్రి అబుష సమర పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement