‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మోగించనున్న సుహాస్

టాలీవుడ్ లో కమెడియన్ గా ప్రవేశించిన కొద్ది కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నారు సుహాస్. ఆ క్రెడిట్ తోనే ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా కూడా ప్రమోట్ అయ్యారు. ప్రస్తుతం సుహాస్ హీరోగా సినిమాలు నిర్మించేందుకు పలువురు నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుహాస్ ప్రస్తుతం ‘ఫ్యామిలీ డ్రామా, రైటర్ పద్మభూషణ్’ లాంటి సినిమాలతో డిఫరెంట్ గా రాబోతున్నారు. తాజాగా సుహాస్ హీరోగా మరో సినిమా అనౌన్స్ అయింది. సినిమా పేరు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. బ్యాండ్ మేళం కాస్ట్యూమ్స్ తో ఉన్న సుహాస్ ను వెనుకగా రివీల్ చేస్తూ .. ఒక గ్రామాన్ని చూపిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో చింతలపూడి గ్రామం, అంబాజీపేట మండలం, తూర్పుగోదావరి జిల్లా, పిన్ కోడ్‌ని కూడా మెన్షన్ చేశారు.  విజయదశమి సందర్భంగా విడుదలైన ఈ లుక్ ఆకట్టుకుంటోంది. ఇది రా అండ్ ఇంటెన్స్ ఫిల్మ్ అని హీరో సుహాస్ ట్విట్టర్ లో తెలిపారు. జీఏ2 పిక్చర్స్, స్వేచ్ఛా క్రియేషన్స్, మహా క్రియేషన్స్ బ్యానర్స్ పై, వెంకటేశ్ మహా సమర్పణలో దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో, ధీరజ్ మోగిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గ్రామాల్లో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు.. బ్యాండ్ వాయించే ఒక ట్రూప్ కు చెందిన కథగా ఈ సినిమా రూపొందుతోంది. కామెడీ ప్లస్ ఎమోషన్స్, పల్లెటూరి జనంలో ఉండే రానెస్, వారి అమాయకత్వాన్ని ఈ సినిమాతో ప్రత్యేకంగా ఎలివేట్ చేయబోతున్నారు. మరి ఈ సినిమా సుహాస్ కెరీర్ ను ఏ రేంజ్ లో మలుపుతిప్పుతుందో చూడాలి.  


Advertisement