చక్కెర చేటు!

ABN , First Publish Date - 2021-08-24T05:30:00+05:30 IST

తీయదనానికి దాసోహం కాని వారు అరుదు. అయితే పరిమితికి మించి తీపి తినడం వల్ల ఆరోగ్యానికి చేటు జరుగుతుంది...

చక్కెర చేటు!

తీయదనానికి దాసోహం కాని వారు అరుదు. అయితే పరిమితికి మించి తీపి తినడం వల్ల ఆరోగ్యానికి చేటు జరుగుతుంది. 


  1. తీపి యావ: తీపి తిన్న ప్రతిసారీ శరీరం మరింత తీపి కోసం పాకులాడుతుంది. దాంతో ఒకసారి తినడంతో సరిపెట్టుకోకుండా తీపి పదార్థాల కోసం అర్రులు చాస్తూ ఉంటాం. అలా పదే పదే తీపి తినడం ద్వారా అవసరానికి మించి క్యాలరీలు శరీరంలో పేరుకుపోతూ ఉంటాయి.
  2. చర్మం: చక్కెర చర్మానికి సాగే గుణాన్నీ, బిగువునూ అందించే కొల్లాజెన్‌ నాణ్యతను దెబ్బతీస్తుంది. ఫలితంగా చర్మం మీద ముడతలు పెరుగుతాయి. మెరుపు తగ్గి, చర్మం జీవం కోల్పోతుంది.
  3. వాపులు, నొప్పులు: తీపి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతుంది. చక్కెరతో కీళ్ల నొప్పులు, వాపులు పెరుగుతాయి. 
  4. పొట్ట నొప్పి: అధిక చక్కెరలు త్వరగా జీర్ణం కావు. ఫలితంగా పొట్టలో వాయువులు పెరిగి, నొప్పి వేధిస్తుంది. 
  5. దంతాలు: చక్కెర దంతాల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. త్వరగా దంతాలు పుచ్చి, ఊడిపోతాయి.
  6. కొవ్వు: తీపి శరీరంలో కొవ్వు పేరుకునే ప్రక్రియను అస్థవ్యస్తం చేస్తుంది. 

Updated Date - 2021-08-24T05:30:00+05:30 IST