దుమ్మురేపిన Sugar stocks.. 9% వరకూ పెరిగిన షేర్లు.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-21T18:19:14+05:30 IST

షుగర్ స్టాక్స్ నేడు స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపాయి. గురువారం ఇంట్రా డేలో చక్కెర కంపెనీ(Sugar Companies)ల షేర్లు బీఎస్ఈ 9 శాతం వరకూ లాభపడ్డాయి.

దుమ్మురేపిన Sugar stocks.. 9% వరకూ పెరిగిన షేర్లు.. కారణం ఏంటంటే..

న్యూఢిల్లీ : షుగర్ స్టాక్స్ నేడు స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపాయి. గురువారం ఇంట్రా డేలో చక్కెర కంపెనీ(Sugar Companies)ల షేర్లు బీఎస్ఈ 9 శాతం వరకూ లాభపడ్డాయి. ఈ రేంజ్‌లో షుగర్ స్టాక్స్ పరుగులు తీయడానికి ఓ కారణం ఉంది. షుగర్ సీజన్ 2021-22లో ప్రభుత్వం 1 మిలియన్ టన్నుల చక్కెర ఎగుమతులను అనుమతించనుందనే నివేదికలు వెలువడ్డాయి. ఇవి షుగర్ స్టాక్స్‌కు మంచి బూస్ట్ ఇచ్చాయి. 


నేటి ట్రేడింగ్‌లో బలరాంపూర్ చినీ మిల్స్(Balarampur Chini Mills), త్రివేణి ఇంజినీరింగ్ అండ్ ఇండస్ట్రీస్(Triveni Engineering & Industries), అవధ్ షుగర్ అండ్ ఎనర్జీ(Avadh Sugar & Energy), దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్(Dalmia Bharat Sugar and Industries), ద్వారికేష్ షుగర్ ఇండస్ట్రీస్(Dwarikesh Sugar Industries), ఉత్తమ్ షుగర్ మిల్స్(Uttam Sugar Mills), శ్రీ రేణుకా షుగర్స్(Shree Renuka Sugars), విశ్వరాజ్ షుగర్ ఇండస్ట్రీస్(Vishwaraj Sugar Industries) బీఎస్‌ఈ(BSE)లో 3 శాతం నుంచి 9 శాతం మధ్య ర్యాలీ చేశాయి. జూన్ 1న చక్కెర ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ తర్వాత గత మూడు నెలల్లో, చక్కెర స్టాక్స్ మార్కెట్‌లో 20 శాతం నుంచి 35 శాతం వరకు పడిపోయాయి. అదే కాలంలో ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్ 4 శాతం క్షీణించింది. 


ప్రభుత్వం ఒక మిలియన్ నుంచి 1.2 మిలియన్ల వరకూ చక్కెర ఎగుమతులను సెప్టెంబర్ 30, 2022 నాటికి అనుమతించే అంశాన్ని పరిశీలిస్తోందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక సూచించింది. ప్రస్తుత సీజన్‌లో 10 మిలియన్ టన్నుల షుగర్‌ను ఎగుమతి చేసిన మీదట.. అదనంగా మరో మిలియన్ టన్నుల అదనపు ఎగుమతి సెప్టెంబర్ 2022 నాటికి ఇన్వెంటరీ స్థాయిలను 5.7 5.7 మిలియన్ టన్నులకు తగ్గిస్తుందని ICICI సెక్యూరిటీస్‌లోని విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - 2022-07-21T18:19:14+05:30 IST