ఘోరం

ABN , First Publish Date - 2022-08-20T07:31:40+05:30 IST

అది కాకినాడ రూరల్‌లోని వాకలపూడిలోని ప్యారీ షుగర్‌ ఫ్యాక్టరీ.. ఎప్ప టిలా కార్మికులు బయటనుంచి వచ్చిన ముడి పంచదార బస్తాలను కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా గోదాములోకి తరలి స్తున్నారు. ఒక్కసారిగా అనుకోని పెనుప్రమాదం కార్మికులను చుట్టేసింది. విద్యుత్‌షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా చెలరేగిన మంటలతో బెల్ట్‌ ముక్కలై బీభత్సం సృష్టించింది.

ఘోరం

  • -కాకినాడ రూరల్‌లోని వాకలపూడి ప్యారీ షుగర్‌ ఫ్యాక్టరీలో ఘోరం
  • -కన్వేయర్‌ బెల్ట్‌కు సమీపంలో విద్యుదాఘాతంతో ఒక్కసారిగా భారీ పేలుడు 
  • -మంటలకు తెగిపోయి ముక్కముక్కలైన బెల్ట్‌ 
  • -అక్కడే పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు కూలీలు దుర్మరణం
  • -ఇందులో ఓ కార్మికుడి శరీరం తునాతునకలు: ముక్కలై చెల్లాచెదరు
  • -తీవ్రంగా గాయపడ్డ ఆరుగురిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమం
  • -గతేడాది టైకీలో బాయిలర్‌ పేలుడు: అప్పుడూ ఇద్దరు కార్మికులు మృతి
  • -కలవరపెడుతున్న వరుస పారిశ్రామిక ప్రమాదాలు
  • -సంఘటన తర్వాత హడావుడి చేసి ఆ తర్వాత మర్చిపోతున్న అధికారులు
  • -విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ఘటన తర్వాత జిల్లాలో గతేడాది పారిశ్రామిక భద్రతపై తనిఖీలు, నివేదికలు
  • -తీరా ఆచరణలో గాలికి వదిలేసిన ప్రభుత్వం

అది కాకినాడ రూరల్‌లోని వాకలపూడిలోని ప్యారీ షుగర్‌ ఫ్యాక్టరీ.. ఎప్ప టిలా కార్మికులు బయటనుంచి వచ్చిన ముడి పంచదార బస్తాలను కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా గోదాములోకి తరలి స్తున్నారు. ఒక్కసారిగా అనుకోని పెనుప్రమాదం కార్మికులను చుట్టేసింది. విద్యుత్‌షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా చెలరేగిన మంటలతో బెల్ట్‌ ముక్కలై బీభత్సం సృష్టించింది. అసలేం జరిగిం దో తేరుకు ని తెలుసుకునే లోపు ఇద్దరు కార్మికులను బెల్ట్‌ తునాతునకలు చేసేసింది. ముఖ్యంగా ఓ కార్మికుడి శరీరం నుజ్జునుజ్జై శరీర భాగాలు చెల్లాచెదురయ్యా యి. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఊహించని ఈ ఘటనతో కార్మికులు బెంబేలెత్తి ప్రాణ భయంతో పరుగులు తీశారు. పనిచేసే ప్రదేశంలో కంపెనీ యాజమా న్యం ఏమాత్రం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తీరని నష్టం జరిగింది. 

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)/సర్పవరం:

కాకినాడ రూరల్‌ మండలం వాకలపూడి బీచ్‌రోడ్డులో ప్యారీ షుగర్‌ రిఫైనరీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో పరిశ్రమ నడుస్తోంది. ఇతర దేశాలనుంచి చక్కెరకు చెందిన ముడి సరుకును నౌకల ద్వారా ఈ పరిశ్రమకు తీసుకు వస్తారు. తిరిగి ఇక్కడే శుద్ధి చేసిన తర్వాత విదేశాలకు నౌకల ద్వారా ఈ బ్రౌన్‌ ఘగర్‌ని ఎగుమతి చేస్తుంటారు. నిరంతరాయంగా నడిచే ఈ పరిశ్రమలో మూడు షిఫ్టుల్లో కార్మికులు పనిచేస్తుంటారు. యథావిధిగా శుక్రవారం ఉదయం షిఫ్ట్‌లో 11మంది 36వ నెంబర్‌ గొడౌన్‌లో ప్యాకింగ్‌ చేసిన షు గర్‌ బస్తాలను కన్వేయర్‌బెల్ట్‌పై లారీల్లోకి లోడింగ్‌ చేస్తున్నారు. ఈక్రమంలో ఉదయం 10.20గంటల మధ్యలో ఒక్క సారిగా భారీ పేలుడు శబ్ధం వినిపించింది. ఇది గమనించి ఇతర కార్మికులు వెళ్లి చూసేసరికి బ్లోయర్‌ ఫ్యాన్‌, సాకెట్‌ ఫ్లగ్‌, ఎంసీబీ కేబుల్‌ విద్యుత్తుషాక్‌తో కాలిపోయి మంటలు ఎగసిపడుతున్నాయి. కొందరు కార్మికులు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నారు. కొందరు గాయపడ్డ కార్మికులు హాహాకారాలు చేస్తున్నారు. తీరా చూస్తే అక్కడికక్కడే ఇద్దరు కార్మికుల మృతదేహా లు ఛిధ్రమై తునాతునకలై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో అది చూసిన మిగి లిన కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. యాజమాన్యానికి విషయం తెలిసి అక్కడకు చేరుకుని అంబులెన్స్‌లు పిలిపించారు. కాసేపటికి పొగ తగ్గడంతో పెను ప్రమాదం చోటుచేసుకున్న విషయం బయటపడింది.

తునాతునకలైన శరీరం..

విద్యుదాఘాతంవల్ల పేలుడు సంభవించి మంటలు చెలరేగడంతో కన్వేయర్‌ బెల్ట్‌ తెగి ముక్కలైపోయింది. ఈ ముక్కలు బలంగా తగలడంతో అక్కడికక్కడ ఇద్దరు కార్మికులు చనిపోయినట్లు గుర్తించారు. మృతి చెందిన వారిలో యు.కొత్తప ల్లి మండలం కొండెవరం శెట్టిబలిజపేటకు చెందిన రాయుడు వీరవెంకటర సత్యనారాయణ(38)గా గుర్తించారు. ప్రమాదం సమయంలో ఇతడు కన్వేయర్‌ బెల్ట్‌ పక్కనే విధులు నిర్వహిస్తుండడంతో శరీర భాగాలు ముక్కలుగా తెగిపడి చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ముఖం నల్లగా గుర్తుపట్టలేని రీతిలో మారిపోయింది. కొన్ని భాగాలైతే ముద్దలైపోవడం చూసి అక్కడున్న వారంతా నిశ్చేష్ఠులయ్యారు. మృతు డికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం కాగా, వృద్ధులైన తల్లిదండ్రులు సైతం ఇతడిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మృతిచెందిన మరో కార్మికుడు సామర్లకోట మండలం వేట్లపాలేనికి చెంది వీరమళ్ల రాజేశ్వరరావు (45)గా గుర్తించారు. ఇతడి శరీరం కూడా ఛిద్రమైంది. ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కరప మండలం కూరాడకు చెందిన జాగు వీరబాబు, పెద్దాపురం గుడివాడకు చెం దిన గర్లంవల సూర్య సుబ్రహ్యణ్యం, కొత్తపల్లి మండలం కొమరగిరికి చెందిన మో రుకుర్తి జగన్నాథం, పిఠాపురం రూరల్‌ మండలం కందరాడకు చెందిన గండి వీరబాబు గాయపడగా వీరిలో వీరబాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను కాకినాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే...

కంపెనీలో ముడి పంచదారను దిగుమతి చేసిన తర్వాత కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా గోదాముల్లోకి తరలిస్తారు. ఈక్రమంలో కొంత దుమ్ము, ధూళి అక్కడ ఎక్కువగా ఉం టుంది. ప్రమాదం సమయంలో కన్వేయర్‌ బెల్ట్‌కు సం బంధించి సమీపంలో 600 కిలోల బరువున్న ఎలక్ట్రికల్‌ ప్యానల్‌ ఉందిందులో షార్ట్‌ సర్య్కూట్‌ అవ డంతో చిన్నపాటి అగ్గి రాజుకుని చిన్నపాటి మంటలు వచ్చాయి.  అదే సమయంలో మండేగుణం ఉన్న ధూళి వాయు వులు కూడా తోడవడంతో ఒక్కసారిగా మంటలు పెరిగి పేలుడు సంభవించింది. అదే సమయంలో కన్వేయర్‌ తిరు గుతుండడంతో పేలుడు ధాటికి బెల్ట్‌ తెగిపోయి తునాతునకలైంది. అలా అత్యంత వేగంగా తిరుగుతున్న భారీ కన్వేయర్‌ బెల్ట్‌ అక్కడే ఉన్న కార్మికులను కొట్టేసింది.

ప్యారీ షుగర్స్‌లో ఇద్దరు కార్మికులు మృతి చెందారన్న సమాచారం అందుకున్న కుటుంబీకులు ప రిశ్రమ వద్దకు చేరుకుని మృతదేహాలను చూపించాలని డిమాండ్‌ చేశారు. పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం జీజీహెచ్‌కు తరలించామని కంపెనీ నిర్వాహకులు చెప్పడంతో తమ కుటుంబీకుల మృతిపై కనీసం సమాచారం ఇవ్వకుం డా మృతదేహాలను ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని అక్కడే ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా పరిశ్రమలో ఇతర కార్మికు లు ఆందోళన చేపట్టారు. రెండువారాలుగా కనీస భద్రతాప్రమాణాలు పాటించకుం డా, కార్మికులకు భద్రతా పరికరాలు ఇవ్వకుండా పనులు చేయిస్తున్నారన్నారు.

మృతుల కుటుంబాలకు రూ.40లక్షలు ఇచ్చేందుకు అంగీకారం

ప్రమాద ఘటన నేపథ్యంలో మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించి కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలని బంధువులు డిమాండ్‌ చేశారు. మృతి చెందిన తీవ్రంగా గాయపడ్డ కాంట్రాక్టు కార్మికులు కిషోర్‌ లాజిస్టిక్‌ ఏజెన్సీకి చెందిన వారిగా కార్మిక సంఘాలు గుర్తించాయి. ఈ సంస్థ కాకినాడ రూరల్‌ కీలకనేత బంధువులదని, అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గి ప్రమాద ఘటనను మసిపూసి పూసి మారేడుకాయ చేయవద్దని నినాదాలు చేశారు. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే కన్నబాబు, ఏఎస్పీ శ్రీనివాస్‌, డీఎస్పీ భీమారావు తదితరుల సమక్షంలో పలు పార్టీ నాయకులు, కార్మిక సంఘాలు కలిసి యాజమాన్యంతో చర్చలు జరిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.40లక్షల చొప్పున నష్టపరిహారం, పీఎఫ్‌, గ్రాట్యుటీ కలిపి మరో రూ.12లక్షలు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయించేందుకు వారు అంగీకరించారు. అంతకుముందు ఎమ్మెల్యే కన్నబాబు, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అక్కడకు వచ్చి కార్మికులు, పరిశ్రమ మేనేజర్‌ బాలాజీతో చర్చలు జరిపారు. ప్రమాదంపై సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటానని కన్నబాబు హామీ ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ సంఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతామని, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడరూరల్‌లో తరచూ పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతుండడంపై కార్మికుల్లో కలవరం వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-08-20T07:31:40+05:30 IST