Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పంచదార, తేనెతో ఇంట్లోనే ఇలా చేస్తే..

twitter-iconwatsapp-iconfb-icon
పంచదార, తేనెతో ఇంట్లోనే ఇలా చేస్తే..

ఆంధ్రజ్యోతి(8-11-2021)

చర్మం నిగారింపు కావాలి. బ్యూటీపార్లర్లకు వెళ్లే ఆలోచన లేదు. ఇంట్లోనే పాటించాల్సిన నియమాలు ఏవైనా ఉన్నాయా? అంటే ఇదిగో ఇలా చేయండి అంటున్నారు సౌందర్యనిపుణులు.


క్లీన్సింగ్‌ : ముఖాన్ని ఫేస్‌ వాష్‌తో లేదా ఫేస్‌ క్లెన్సర్‌తో కడుక్కోవాలి. గోరువెచ్చటి నీళ్లను ఉపయోగించాలి. తరువాత మెత్తటి టవల్‌తో తుడుచుకోవాలి. చర్మరంధ్రాలు శుభ్రపడాలంటే క్లీన్సింగ్‌ మిల్క్‌లో దూది అద్ది ముఖంపై తుడుచుకోవాలి.


పంచదార, తేనెతో ఇంట్లోనే ఇలా చేస్తే..

ఆవిరి : ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. స్టీమర్‌ లేకపోతే పాత్రలో నీళ్లు వేడి చేయడం ద్వారా కూడా ఆవిరి పట్టొచ్చు. ఆవిరి పట్టడం పూర్తయ్యాక బ్లాక్‌హెడ్స్‌ ఉంటే రిమూవర్‌తో తొలగించుకుని మెత్తటి టవల్‌తో తుడుచుకోవాలి.

పంచదార, తేనెతో ఇంట్లోనే ఇలా చేస్తే..

స్క్రబ్‌ : మృతకణాలు తొలగిపోవాలంటే స్క్రబ్బింగ్‌ తప్పనసరి. ఏదైనా ఫేస్‌ స్క్రబ్‌తో ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ముఖంపై స్క్రబ్‌ చేయాలి. కాసేపయ్యాక నీళ్లతో కడిగేసుకోవాలి. రెడీమేడ్‌ స్క్రబర్‌ లేకపోతే పంచదార, తేనె మిశ్రమాన్ని వాడొచ్చు.

పంచదార, తేనెతో ఇంట్లోనే ఇలా చేస్తే..

ఫేస్‌ప్యాక్‌ : ఫేస్‌ప్యాక్‌ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. మంచి మాయిశ్చరైజింగ్‌ గుణాలున్న ఫేస్‌ప్యాక్‌ ఉపయోగిస్తే ఫలితం బాగుంటుంది. పసుపు, శనగపిండి, అలొవెరా, తేనె, ముల్తానీ మట్టి ఉన్న ఫేస్‌ప్యాక్‌ అయితే మంచిది. అరటిపండు, బొప్పాయి ఫేస్‌ప్యాక్‌లు కూడా మంచి ఫలితాన్నిస్తాయి.

పంచదార, తేనెతో ఇంట్లోనే ఇలా చేస్తే..

టోనర్‌ : ఫేస్‌ఫ్యాక్‌ తరువాత ముఖాన్ని ఆరనివ్వాలి. ఇప్పుడు పీహెచ్‌ బ్యాలెన్స్‌ కోసం టోనర్‌ను అప్లై చేయాలి. టోనర్స్‌ మార్కెట్లో లభిస్తాయి. ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌, అలొవెరా, కీరదోస, రోజ్‌వాటర్‌ను టోనర్‌కు బదులు ఉపయోగించవచ్చు.

పంచదార, తేనెతో ఇంట్లోనే ఇలా చేస్తే..

మాయిశ్చరైజర్‌ : చివరగా మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. పొడి చర్మం ఉన్న వారు థిక్‌ మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.