Viral Video: మంచుకి గడ్ట్టకట్టి విలవిల్లాడుతున్న జింక.. చివరికి ఏమైందంటే..

ABN , First Publish Date - 2021-12-27T10:56:02+05:30 IST

చలికాలం పైగా మంచు ప్రాంతం.. ఇలాంటి పరిస్థితులలో మనుషులకే కాదు మూగజీవాలకు కూడా కష్టాలు తప్పవు. కొన్నిసార్లైతే విపరీతమైన చలికి అటవి ప్రాంతాలలో ఎన్నో ప్రాణులు చనిపోతూ ఉంటాయి. అలాంటి ఒక ఘటన కజకిస్తాన్‌లో జరిగింది. అక్కడ ఒక జింక శరీరమంతా మంచుతో...

Viral Video: మంచుకి గడ్ట్టకట్టి విలవిల్లాడుతున్న జింక.. చివరికి ఏమైందంటే..

చలికాలం పైగా మంచు ప్రాంతం.. ఇలాంటి పరిస్థితులలో మనుషులకే కాదు మూగజీవాలకు కూడా కష్టాలు తప్పవు. కొన్నిసార్లైతే విపరీతమైన చలికి అటవి ప్రాంతాలలో ఎన్నో ప్రాణులు చనిపోతూ ఉంటాయి. అలాంటి ఒక ఘటన కజకిస్తాన్‌లో జరిగింది. అక్కడ ఒక జింక శరీరమంతా మంచుతో గడ్డకట్టుకుపోయి రోడ్డుపై కదల్లేని స్థితిలో ఉంది. అది ఎంతో కష్టపడి కొంతదూరం నడిచినా శరీరం సహకరించక మళ్లీ కింద పడిపోయింది. ఆ అమాయక ప్రాణి పరిస్థితిని గమనించిన కొందరు స్థానికులు వీడియో రికార్డ్ చేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. 


ఆ వీడియోలో ఒక జింక శరీరానికి చాలా వరకు గడ్డ కట్టుకు పోయి..రోడ్డు పక్కన నిలబడి ఉంది. దాని ముఖంలో నోరు, కళ్లకు బాగా మంచు గడ్డలు ఉన్నాయి. అలాగే వెనుక వీపు, కాళ్లకు కూడా మంచు గడ్డలు ఉన్నాయి. దాంతో ఆ మూగజీవి అతి కష్టంగా కదలగలుగుతోంది. ముఖ్యంగా నోటికి, ముక్కు చుట్టూ ఉన్న మంచుతో అది సరిగా ఊపిరి కూడా పీల్చుకోలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ రోడ్డు మీద నుంచి కారులో వెళుతున్న ఒక వ్యక్తి దానిని చూసి జాలి పడి. దాని దెగ్గరకు వెళతాడు. అది భయంతో కొంత దూరం రోడ్డుపై వెళుతుంది. కానీ నడవలేక మళ్లీ పడిపోతుంది. ఆ వ్యక్తి దాని కాళ్లను పట్టుకొని దాని నోరు, కళ్లకు ఉన్న మంచును మెల్లగా తొలగిస్తాడు. మంచు బాగా గడ్డ కట్టుకుపోవడంతో.. తొలగించేటప్పుడు ఆ జింక నొప్పి భరించలేక అరుస్తుంది. కానీ ఆ తరువాత తన ముఖంపై మంచు తొలిగాక ఎగురుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.


ఈ వీడియో చూసిన నెటిజెన్లంతా జంతువుల కష్టాల గురించి కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోకి విపరీతమైన లైక్స్, వ్యూస్ వస్తున్నాయి.



Updated Date - 2021-12-27T10:56:02+05:30 IST