అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-09-19T04:07:50+05:30 IST

అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం హుస్నాబాద్‌ పట్టణం అక్కన్నపేట రోడ్డులో జరిగింది.

అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య

 హుస్నాబాద్‌, సెప్టెంబరు 18: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం హుస్నాబాద్‌ పట్టణం అక్కన్నపేట రోడ్డులో జరిగింది. ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన కోతి రాకేష్‌ (30) హుస్నాబాద్‌ పట్టణంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ తరిగొప్పుల, హుజూరాబాద్‌, హుస్నాబాద్‌ ప్రాంతాల్లో బైక్‌ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. సరైన గిరాకిలు లేక దాదాపు రూ.5 లక్షల అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో మనస్తాపానికి గురై తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాకే్‌షకు భార్య మౌనిక, పదేళ్లలోపు కుమారుడు, కూతురు ఉన్నారు. తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.  


 

Updated Date - 2021-09-19T04:07:50+05:30 IST