Abn logo
Mar 25 2020 @ 19:57PM

ఆ సినిమాకు రెండేళ్లు శిక్షణ తీసుకున్న సుధీర్ బాబు

ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ హవా ఉన్న స‌మ‌యంలో ప్ర‌ముఖ బాడ్మింట‌న్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్‌ను తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు. బాడ్మింట‌న్ ఆట‌లో జాతీయ‌స్థాయి  ఆట‌గాడుగా ఉండి హీరోగా మారిన సుధీర్‌బాబుతో ఈ బ‌యోపిక్‌ను తెర‌కెక్కించాల‌నుకున్నారు. గ‌రుడవేగ ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు ఈ చిత్రానికి డైరెక్ట‌ర్‌గా ఖ‌రారైయ్యాడు. అయితే ఎప్ప‌టి నుండో ఈ సినిమా వార్త‌ల్లో వినిపిస్తూనే ఉంది కానీ కార్య‌రూపం దాల్చ‌లేదు. అందుకు కార‌ణం స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రం కోసం సుధీర్‌బాబు త‌న బాడ్మింట‌న్ ఆట‌కు ప‌దును పెట్టాడ‌ట‌. దాదాపు రెండేళ్లు శిక్ష‌ణ తీసుకున్నాడ‌ట‌. తెలుగు, హిందీల్లో ఈ సినిమాను ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ నిర్మించ‌నుంద‌ని టాక్‌. మ‌రి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడు వెలువ‌డ‌నుందో వేచి చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement