హీరో సుధీర్‌బాబు తదుపరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు సంపాదించుకున్న హర్షవర్దన్ రైటర్ కూడా. ఈయన దర్శకత్వంలో సుధీర్‌బాబు సినిమా చేయబోతున్నారు. ఏషియన్ సునీల్ నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై నారాయణ దాస్ కె.నారంగ్, పుస్కూరు రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'నా సినీ జర్నీలో ఈ సినిమాలో ఛాలెంజింగ్ పాత్ర చేస్తున్నాను. ఇప్పటి వరకు చేయని పాత్ర చేయబోతున్నా'నంటూ సుధీర్ సినిమా గురించి ట్వీట్ చేశారు. ఇప్పటికే సుధీర్ హీరోగా రెండు సినిమాలు రూపొందుతున్నాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఓ సినిమా అయితే శ్రీదేవి సోడా సెంటర్ మరో సినిమా. మరోవైపు పుల్లెల గోపీచంద్ బయోపిక్ కోసం సుధీర్‌బాబు సిద్ధమవుతున్నాడు.