Apr 20 2021 @ 14:21PM

డైరెక్టర్‌గా సుధీర్ బాబు..!

సుధీర్ బాబు ఒక్కో సినిమాని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నాడు. అందరి హీరోల మాదిరిగా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేయకుండా కథా బలమున్న సినిమాలను చేస్తూ తన క్రేజ్‌ను పెంచుకుంటున్నాడు. టాలీవుడ్‌లో సుధీర్ బాబు సినిమాలకి మంచి మార్కెట్ ఉంది. గత ఏడాది ఇంద్రగంటి మోన కృష్ణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నానితో కలిసి 'వి' సినిమా చేసిన సుధీర్ బాబు ఆ సినిమాలో చేసిన పోలీస్ పాత్రలో అదరగొటాడు. ఒక రకంగా నాని కంటే సుధీర్ బాబు పాత్రకే ఎక్కువగా పేరు వచ్చింది. ఇక సుధీర్ బాబు ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'.. అనే విభిన్నమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుదీర్ బాబు డైరెక్టర్‌గా నటిస్తున్నాడు. 

ఇంద్రగంటి సినిమాలన్ని ఎంతో విభిన్నమైన కథాంశాలలతో తెరకెక్కుతుంటాయి. ఆ తరహాలోనే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాని కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాని ఇంద్రగంటి తెరకెకిస్తున్నాడు. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా పెద్ద హిట్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారట. ఈ సినిమాతో పాటు 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాను 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'పలాస' సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.