‘యూపీఎస్‌సీ జిహాదీ’ ప్రోగ్రాంపై సుదర్శన్ టీవీకీ షోకాజ్ నోటీసు

ABN , First Publish Date - 2020-09-24T02:14:16+05:30 IST

మేము ఇచ్చిన నోటీసులో ప్రధానమైన ఒక హెచ్చరిక చేశాం. ప్రోగ్రాం కోడ్‌కు విరుద్ధంగా అవాస్తవాలను ప్రచారం చేయొద్దు’’ అని సుదర్శన్ టీవీకి తెలిపినట్లు సుప్రీం ముందు కేంద్రం తెలిపింది

‘యూపీఎస్‌సీ జిహాదీ’ ప్రోగ్రాంపై సుదర్శన్ టీవీకీ షోకాజ్ నోటీసు

న్యూఢిల్లీ: దేశంలో విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా నిర్మించిన ‘యూపీఎస్‌సీ జిహాదీ’ అనే కార్యక్రమంపై సుదర్శన్ టీవీ యాజమాన్యానికి నోటీసులు పంపినట్లు సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ‘ప్రభుత్వ సేవల్లో చొరబడడానికి ముస్లింలు కుట్రలు పన్నుతున్నార’ని ఆ ప్రోగ్రాంలో ప్రోమోలో పేర్కొన్నారు. ప్రైమా ఫేసీ కోడ్‌ను సుదర్శన్ టీవీ ఉల్లంఘించిందని.. దీనిపై ఈ నెల (సెప్టెంబర్) 28 లోగా వివరణ కోరినట్లు ప్రభుత్వం చెప్పుకొచ్చింది.


‘‘ప్రైమా ఫేసీ కోడ్‌ను ఉల్లంఘించారని స్పష్టంగా తెలుస్తోంది. ముస్లింలను దుర్భషలాడటం, వారిని అవమానించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని స్పష్టమైంది’’ అని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. అంతే కాకుండా కార్యక్రమంలోని కొన్ని చిత్రాలు (ఇమేజ్) చాలా ఇబ్బంది కలిగించేవిగా, బాధపెట్టేవిగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.


‘‘మేము ఇచ్చిన నోటీసులో ప్రధానమైన ఒక హెచ్చరిక చేశాం. ప్రోగ్రాం కోడ్‌కు విరుద్ధంగా అవాస్తవాలను ప్రచారం చేయొద్దు’’ అని సుదర్శన్ టీవీకి తెలిపినట్లు సుప్రీం ముందు కేంద్రం తెలిపింది. కాగా, ఇదే విషయమై అక్టోబర్ 5న మళ్లీ వాదనలు వింటామని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ కేమ్ జోసెఫ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది.

Updated Date - 2020-09-24T02:14:16+05:30 IST