సుదీప్ పాన్ ఇండియా మూవీకి డేట్ ఫిక్స్

శాండిల్‌వుడ్ స్టార్ హీరో సుదీప్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘విక్రాంత్ రోణా’.  అనూప్ భండారీ దర్శకత్వంలో జాక్ మంజునాథ్, షాలినీ మంజునాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏకంగా 14 భాషల్లో 55 దేశాల్లో త్రిడీలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ఇంకా నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సుదీప్ బర్త్ డే నాడు విడుదలయిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో కు అద్బుత స్పందన లభించింది. ఇందులో సుదీప్ శత్రువుల గుండెల్లో దడపుట్టించే లార్డ్ ఆఫ్ ద డార్క్ గా అదరగొట్టబోతున్నారు. ఇక ఈ సినిమాకి విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. 


వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న ‘విక్రాంత్ రోణా’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ లో సుదీప్ లుక్ ఆకట్టుకుంటోంది. బుల్లెట్ పై అగ్రెసివ్ గా రివీలైన ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల  ‘కోటిగొబ్బ 3’ చిత్రం తో అభిమానుల్ని అలరించిన సుదీప్ తదుపరి చిత్రం ఇదే కావడంతో ‘విక్రాంత్ రోణా’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 


Advertisement