రోడ్డుపైనే స్టెప్పులేసిన వరుడు.. అది చూసి అకస్మాత్తుగా చెప్పులు తీసిన వధువు.. తర్వాత ఆమె చేసిన పనికి విస్తుపోయిన అతిథులు

ABN , First Publish Date - 2022-01-10T15:56:55+05:30 IST

పెళ్లి చేసుకోబోతున్న సంతోషంలో నడీరోడ్డుపైనే వరుడు డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. బీట్‌కు తగ్గట్టు స్టెప్పులేస్తున్న వరుడిని చూసి.. పక్కనే ఉన్న వధువు అకస్మాత్తుగా తన కాళ్లకు ఉన్న చెప్పులు తీసింది. ఆ తర్వాత ఆమె చేసిన పనికి అక్కడున్న

రోడ్డుపైనే స్టెప్పులేసిన వరుడు.. అది చూసి అకస్మాత్తుగా చెప్పులు తీసిన వధువు.. తర్వాత ఆమె చేసిన పనికి విస్తుపోయిన అతిథులు

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి చేసుకోబోతున్న సంతోషంలో నడీరోడ్డుపైనే వరుడు డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. బీట్‌కు తగ్గట్టు స్టెప్పులేస్తున్న వరుడిని చూసి.. పక్కనే ఉన్న వధువు అకస్మాత్తుగా తన కాళ్లకు ఉన్న చెప్పులు తీసింది. ఆ తర్వాత ఆమె చేసిన పనికి అక్కడున్న వారంతా విస్తుపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



భారత్‌కు చెందిన యువకుడు విదేశాల్లో నివసిస్తూ అక్కడి అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఆ యువతి కూడా ఈ అబ్బాయిని ఇష్టపడటంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు పెళ్లి ముహూర్తాన్ని ఖరారు చేశారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో విహాహం జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే షేర్వానీ ధరించి.. మండపం వద్దకు పెళ్లి కుమారు చేరుకున్నాడు. సంప్రదాయబద్దంగా తయారై అక్కడకు వచ్చిన వధువును చూసి.. ఆనందంతో పొంగిపోయాడు. ఈ క్రమంలోనే ఉత్సాహంగా బ్యాండ్ మేళంతో చిందేశాడు. వరుడు డ్యాన్సు చేస్తుండగా పక్కనే ఉన్న వధువు.. అకస్మాత్తుగా తన కాళ్ల చెప్పులను తీసేసింది. ఆ తర్వాత వరుడుతో పోటీ పడుతూ డ్యాన్స్ చేసింది. దీంతో అక్కడున్న అతిథులు ఆశ్చర్యపోయారు. కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. 






Updated Date - 2022-01-10T15:56:55+05:30 IST