ఆ మహిళ చనిపోయి రెండు రోజులు పూర్తవుతున్నా అంత్యక్రియలు చేయని కుటుంబ సభ్యులు.. అసలు కారణమేంటంటే..

ABN , First Publish Date - 2021-11-26T18:53:17+05:30 IST

ఆ మహిళ పొలంలో పనిచేయడానికి భర్తతో కలిసి వెళ్లింది.. పొలంలోకి దిగి పనిచేస్తుండగా హఠాత్తుగా ఆమె కుప్పకూలిపోయింది..

ఆ మహిళ చనిపోయి రెండు రోజులు పూర్తవుతున్నా అంత్యక్రియలు చేయని కుటుంబ సభ్యులు.. అసలు కారణమేంటంటే..

ఆ మహిళ పొలంలో పనిచేయడానికి భర్తతో కలిసి వెళ్లింది.. పొలంలోకి దిగి పనిచేస్తుండగా హఠాత్తుగా ఆమె కుప్పకూలిపోయింది.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. వైద్యులు పోస్ట్‌మార్టమ్ నిర్వహించి మృతదేహాన్ని భర్తకు అప్పగించారు.. అయితే ఆ మహిళ సోదరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.. తమ సోదరి అనారోగ్యం వల్ల కాదని, భర్త వల్లే చనిపోయిందని ఫిర్యాదు చేశారు.. మృతదేహాన్ని భర్త కుటుంబానికి ఇవ్వడానికి వారు నిరాకరించారు..  దీంతో వివాదం మొదలైంది.. దీంతో మృతదేహం రెండ్రోజులుగా మార్చురీలోనే ఉండిపోయింది. 


రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన దోబీ బాయి (60) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. అయినా సరే మంగళవారం ఉదయం భర్తతో కలిసి పొలం పనికి వెళ్లింది. పొలం పని చేస్తూనే హఠాత్తుగా కుప్పకూలిపోయింది. భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయింది. దీంతో వైద్యులు పోస్ట్‌మార్టమ్ నిర్వహించి మృతదేహాన్ని భర్తకు అప్పగించారు. అయితే దోబీ బాయి సోదరులు హాస్పిటల్‌కు చేరుకుని గొడవ ప్రారంభించారు. భర్త కుటుంబం వల్లే తమ సోదరి చనిపోయిందని ఆరోపించారు. 


మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లేందుకు వీలు లేదని నిరసన ప్రారంభించారు. పోలీసులు వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చే వరకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకూడదని వారు పట్టుబట్టారు. దీంతో మహిళ మృతదేహం హాస్పిటల్ మార్చురీలోనే ఉండిపోయింది. 


Updated Date - 2021-11-26T18:53:17+05:30 IST