Jul 8 2021 @ 19:25PM

హోమ్లీ లుక్‌.. సడెన్‌గా ఆండ్రియాలో ఈ మార్పేంటి?

కోలీవుడ్‌లోని మల్టీటాలెంటెడ్‌ హీరోయిన్లలో ఆండ్రియా ఒకరు. ‘పచ్చైకిళి ముత్తుసరం’ అనే చిత్రం ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయమైంది. ఆ తర్వాత తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రల్లో ఆమె నటిస్తూ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. పైగా ఆమె మంచి ప్రతిభ కలిగిన గాయని కూడా. పలు చిత్రాల్లో అనేక పాటలు పాడి మంచి గాయనిగా కూడా పేరు గడించింది. ఆమె నటించిన ‘వడచెన్నై’, ‘తరమణి’, ‘ఆయిరత్తిల్‌ ఒరువన్‌’ వంటి చిత్రాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. వీటితోపాటు మ్యూజికల్‌ నైట్స్‌, ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ చేస్తూ బిజీగా ఉందీ భామ. ఈ నేపథ్యంలో ఆండ్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఎల్లవేళలా గ్లామరస్‌గా ఉండే ఫొటోలను మాత్రమే షేర్‌ చేస్తూ వస్తోంది. కానీ, ఇప్పుడు అందుకు భిన్నంగా హోమ్లీ లుక్‌లో చుడిదార్‌ ధరించి తీసిన ఫొటోలను షేర్‌ చేసింది. హోమ్లీ లుక్‌లో ఆండ్రియాను చూసిన ఆమె ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్‌ ఒకింత షాక్‌కు గురయ్యారు. సడెన్‌గా ఆండ్రియాలో ఈ మార్పు ఏంటి? అంటూ పలువురు నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.


Otherwoodsమరిన్ని...