అధికారుల వేధింపులు భరించలేక డీలర్‌ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-09-29T05:35:25+05:30 IST

మండల కేంద్రానికి చెందిన చౌకధరల డిపో డీలర్‌ నా గమ్మ.. అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు యత్నించింది.

అధికారుల వేధింపులు భరించలేక డీలర్‌ ఆత్మహత్యాయత్నం

బ్రహ్మసముద్రం, సెప్టెంబరు28: మండల కేంద్రానికి చెందిన చౌకధరల డిపో డీలర్‌ నా గమ్మ.. అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు యత్నించింది. వైసీపీ నాయకులు గ్రా మంలోని డీలర్‌ను మార్చాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అధికారులు తరచూ దా డులు చేయడం, వారిని రాజీనామా చేయాలం టూ ఒత్తిడి తీసుకొస్తుండడంతో విసిగిన నాగమ్మ సోమవారం పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలో పడివు న్న ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ని లకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తాము కూడా వైసీపీలోనే కొనసాగుతున్నామన్నారు. సర్పంచ కుటుంబ స భ్యులు, వైసీపీ నాయకులు కలిసి తమను తొలగించేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చి, నిత్యం వేధిస్తున్నారని ఆవేదన చెందారు.


Updated Date - 2021-09-29T05:35:25+05:30 IST