Abn logo
May 26 2020 @ 15:18PM

అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థిని మృతి

హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థిని మృతి చెందిన ఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాగర్ రింగ్ రోడ్‌లో ఉన్న అలేఖ్య టవర్స్‌లోని 14వ అంతస్థులో నివసిస్తున్న రఘురాం, పద్మల కూతురు సాహితి. ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కాలేజీలో (బీడీఎస్) నాలుగో సంవత్సరం చదువుతోంది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో తన నివాసంలో బాల్కనీలో ఉన్న గ్రిల్స్ తొలగించి పై నుంచి దూకింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో.. చాలాకాలంగా మనోవేదనకు గురైన సాహితి ఆత్మహత్య చేసుకున్నట్టు తండ్రి రఘురామ్ తెలిపారు. ఇదిలా ఉంటే అనుమానస్పద మృతిగానే పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే పూర్తి వివరాలు అందిస్తామని పోలీసులు తెలిపారు. 

అవి ఇవిమరిన్ని...