Abn logo
Jun 19 2021 @ 22:16PM

పంప్‌ ఆపరేటర్‌ ఆత్మహత్య

కావలి రూరల్‌, జూన్‌ 19: పట్టణంలోని బాపూజీనగర్‌ మున్సిపల్‌ వాటర్‌ ట్యాంక్‌ దగ్గర పంప్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న షేక్‌ అల్తాఫ్‌(29) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం సాయంత్రం వెలుగు చూసింది. తుఫాన్‌నగర్‌కు చెందిన అల్తాఫ్‌ బాపూ జీనగర్‌లోని వాటర్‌ ట్యాంకు దగ్గరకు డ్యూటీకి వచ్చి అక్కడ నిర్మాణంలో ఉన్న భవనంలో పురు గుల మందు తాగి మృతిచెంది ఉండటాన్ని సహచర ఉద్యోగులు గుర్తించి పోలీసులకు సమాచా రం అందజేశారు. ఆత్మహత్యకు అప్పుల బాధ, మరే కారణాలైనా ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలిని ఎస్‌ఐ అరుణ కుమారి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.