టీవీ, సెల్‌ఫోన్‌ చూడొద్దని తల్లి మందలింపు

ABN , First Publish Date - 2021-04-17T05:31:37+05:30 IST

టీవీ, సెల్‌ఫోన్‌ చూడొద్దని తల్లి మందలింపు

టీవీ, సెల్‌ఫోన్‌ చూడొద్దని తల్లి మందలింపు
మృతిచెందిన దీపిక

క్షణికావేశంలో కూతురు ఆత్మహత్య   

ఏకేతండాలో విషాదం

రాయపర్తి, ఏప్రిల్‌ 16 : తరచూ టీవీ, సెల్‌ఫోన్‌ చూడొద్దని తల్లి సూచించినందుకు, క్షణికావేశంలో కూతురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏకేతండాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.  మునావత్‌ ఈర్యాకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. వ్యవసాయం చేసు కుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. కూతురు మునావత్‌ దీపిక అలియాస్‌ గీతిక(16) కొత్తూరు ప్రభుత్వ పాఠ శాలలో పదో తరగతి చదువుతోంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాస్‌లు నడుస్తుండడంతో ఇంట్లోనే ఉంటోంది. గీతిక తరచూ టీవీ, సెల్‌ఫోన్‌ చూస్తుండడంతో వాటిని పక్కనెట్టి చదువుకోమని గురువారం తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన గీతిక ఉద యం వ్యవసాయ బావివద్దకు వెళ్లి పురుగుల మందుతాగి ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే వాంతులు కావ డంతో తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకుని ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొం దుతూ గురువారం రాత్రి మృతిచెందింది. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం మృతదే హాన్ని అప్పగించారు. గీతిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో దీపిక ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.


Updated Date - 2021-04-17T05:31:37+05:30 IST