క్రైస్తవాన్ని అనుసరించడం వల్లే ఆ ఆలోచన జగన్‌కు కలిగింది : సుచరిత

ABN , First Publish Date - 2021-12-14T12:15:17+05:30 IST

జగన్ పాలనలో రాజ్యాంగ ఫలాలను అందరికి సమానంగా అందించే ఆలోచన వెనుక అసలు రహాస్యం ఏపీ ముఖ్యమంత్రి క్రైస్తవాన్ని అనుసరించడమేనని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.

క్రైస్తవాన్ని అనుసరించడం వల్లే ఆ ఆలోచన జగన్‌కు కలిగింది : సుచరిత

అమరావతి: జగన్ పాలనలో రాజ్యాంగ ఫలాలను అందరికి సమానంగా అందించే ఆలోచన వెనుక అసలు రహాస్యం ఏపీ ముఖ్యమంత్రి క్రైస్తవాన్ని అనుసరించడమేనని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలోని క్రైస్తవ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవాన్ని అనుసరిoచటం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఫలాలను సమానంగా అందించగలిగే ఆలోచన ముఖ్యమంత్రి జగన్‌కు కలిగిందని సుచరిత తెలిపారు. కులం వేరు, మతం వేరు ఎవరైనా వారి వారి విశ్వాసానుసారం మతమార్పిడి చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్ సర్కార్‌కే చెల్లిందని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.


Updated Date - 2021-12-14T12:15:17+05:30 IST