Three kidneys: టెస్ట్ రిపోర్టులు చూసి నివ్వెరపోయిన డాక్టర్లు.. అతడికి రెండు కాదు ఏకంగా మూడు కిడ్నీలు ఉండటం చూసి..

ABN , First Publish Date - 2022-08-14T17:40:24+05:30 IST

సాధారణంగా మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయనే విషయం...

Three kidneys: టెస్ట్ రిపోర్టులు చూసి నివ్వెరపోయిన డాక్టర్లు.. అతడికి రెండు కాదు ఏకంగా మూడు కిడ్నీలు ఉండటం చూసి..

సాధారణంగా మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయనే విషయం తెలిసిందే. కొందరికి ఒక కిడ్నీ ఉందనే వార్తలు వినేవుంటాం. వీటికి భిన్నంగా ఇప్పుడు మరో ఉదంతం మన ముందుకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్ఫూర్‌కు చెందిన వ్యాపారి సుశీల్ గుప్తాకు మూడు కిడ్నీలు ఉన్నాయి. వైద్య ప్రపంచంలో ఇటువంటి కేసులు చాలా అరుదు. మూడు కిడ్నీలు ఉన్నప్పటికీ సుశీల్ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే ఈ తరహా వ్యక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సివుంటుంది.  మీడియాతో సుశీల్ మాట్లాడుతూ 2020లో తొలిసారిగా పిత్తాశయం ఆపరేషన్ కోసం అల్ట్రాసౌండ్ చేయించుకోవాల్సి వచ్చిందని, అప్పుడు తన శరీరంలో మూడు కిడ్నీలు ఉన్నాయంటూ రిపోర్ట్ వచ్చిందన్నారు. అయితే వైద్యులు మళ్లీ అల్ట్రాసౌండ్ చేయించి, తన శరీరంలోని మూడు కిడ్నీలు సాధారణంగా పనిచేస్తున్నాయని తెలిపారన్నారు. 


తనకు ఎడమవైపు రెండు కిడ్నీలు ఉండగా, కుడివైపు ఒక కిడ్నీ ఉందని చెప్పారు. ఈ ఉదంతంపై నారాయణ మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. కడుపులోని పిండం అభివృద్ధి చెందుతున్న క్రమంలో రెండు కిడ్నీలు ఒక వైపుకు అభివృద్ధి చెందాయని, అందుకే అతనికి మూడు కిడ్నీలు ఉన్నాయని తెలిపారు. అలాంటి వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటివారికి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కిడ్నీ దెబ్బతినే అవకాశాలున్నాయన్నారు. పైగా అలాంటివారు మార్షల్ ఆర్ట్స్, కరాటే లాంటి క్రీడలు ఆడకూడదని తెలిపారు. యుగ్ దధీచి దేహదాన్ సంస్థ వ్యవస్థాపకుడు మనోజ్ సెంగార్ మాట్లాడుతూ  వ్యాపారి సుశీల్ గుప్తాకు మూడు కిడ్నీలు ఉన్నాయని వెల్లడయ్యిందన్నారు. 

Updated Date - 2022-08-14T17:40:24+05:30 IST