Abn logo
Sep 26 2021 @ 00:37AM

భారత్‌బంద్‌ను జయప్రదం చేయండి

బుద్ద నాగజగదీశ్‌

టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద


అనకాపల్లి, సెప్టెంబరు 25: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 27న తలపెట్టిన భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు పిలుపునిచ్చారు. బంద్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మద్దతు ప్రకటించినందున అన్ని మండలాల నుంచి పార్టీ శ్రేణులు బంద్‌లో పాల్గొనాలని కోరారు. వ్యవసాయ రంగం రక్షణ, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కార్మిక సంఘాల హక్కులు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని బుద్ద విజ్ఞప్తి చేశారు.