పసిగుండెకు సోనూసూద్‌ సాయం

ABN , First Publish Date - 2021-10-19T08:13:23+05:30 IST

సామాజిక సేవకుడు, బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ దాతృత్వం..

పసిగుండెకు సోనూసూద్‌ సాయం

ముంబైలో విజయవంతంగా శస్త్రచికిత్స 

కల్లూరు, అక్టోబరు 18: సామాజిక సేవకుడు, బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ దాతృత్వం.. ఓ పసివాడి ప్రాణాలను నిలిపింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరుకు చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతుల కుమారుడికి పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్య ఏర్పడింది. శస్త్రచికిత్సకు రూ.6లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆ దంపతులు తల్లడిల్లిపోయారు. కృష్ణ బంధుమిత్రులు.. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరు జన విజ్ఞాన వేదిక కార్యదర్శి రామ్‌ప్రతీ్‌పకు చేరింది. ఆయన పసివాడి పరిస్థితి సోనూసోద్‌ దృష్టికి వెళ్లేలా చేశారు. స్పందించిన సోనూసూద్‌.. ముంబైలోని వాడియా ఆస్పత్రిలో వైద్యం చేయించారు. వైద్యులు 4గంటలపాటు శ్రమించి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారని.. పిల్లాడి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రతీప్‌ తెలిపారు.   

Updated Date - 2021-10-19T08:13:23+05:30 IST