Abn logo
Aug 13 2020 @ 18:46PM

పట్నం వద్దు.. పల్లె ముద్దు అంటున్న సక్సెస్‌ఫుల్ బ్రదర్స్

పట్నం వద్దు.. పల్లె ముద్దు అనుకున్నారు. అందుకే మంచి చదువులు చదివినా ఉన్న ఊర్లోనే సెటిల్ అవ్వాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా చిన్న వ్యాపారం ప్రారంభించారు. అదే వ్యాపారంలో ఇతరులు ఎందుకు నష్టపోతున్నారో తెలుసుకున్నారు. అందుకే కొత్తదారిలో వెళ్లి సక్సెస్ అయ్యారు. ఇంతకీ వాళ్లు చేసిన వ్యాపారం ఏంటి?..వాళ్లు ఎవరు?. పెద్దపల్లి జిల్లాలోని సక్సెస్ ఫుల్ బ్రదర్స్‌పై ఏబీఎన్ కథనం. 


పెద్దపల్లి జిల్లా అంతర్గామ మండలం రాయదండికి చెందిన ముగ్గురు అన్నదమ్ము సతీశ్, రాజు, శ్యామ్ సుందర్.. అందరిలా కాకుండా కొత్తగా ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పొందాలని భావించారు. ఇంటి దగ్గర నాటు కోళ్ల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఏడాది పాటు చాలా చోట్ల కోళ్ల పారాల యజమానులతో మాట్లాడి లాభనష్టాలు తెలుసుకున్నారు. కోళ్ల పెంపకంపై బాగా అధ్యయనం చేశారు. అయితే వీరు కలిసిన వాళ్లలో ఎక్కువగా వ్యాపారంలో నష్టపోయినవాళ్లే ఉండటంతో భారీగా పెట్టబడి పెట్టకుండా చిన్నగా ప్రారంభించారు. చిన్న రేకుల షెడ్డు వేసి అందులో పది పెట్టలు, 2 పుంజులు పెంచారు. వాటికి దానాగా మక్కలు, వరి నూక, తవుడు సజ్జలు రాగుల మిశ్రమాన్ని వేశారు. మూడేళ్లలో నాటు కోళ్లను అమ్ముతూ ఉన్నప్పటికీ ఇంకా ఐదు వందల కోళ్లు ఉన్నాయి. మొదట్లో నాటు కోళ్లను పెంచిన ఈ అన్నదమ్ములు తర్వాత పామురాళ్లు, కౌజు పిట్టలు, కుందేళ్లు పెంచడం ప్రారంభించారు. ఇక్కడే ఏదైనా సాధించడం ఆనందంగా ఉందని అంటున్నారు. 


Advertisement
Advertisement